contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పసికందు విక్రయం? వనస్థలిపురంలో సంచలనం

హైదరాబాద్: వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిని కేంద్రంగా చేసుకుని పసికందు విక్రయానికి సంబంధించిన ఆరోపణలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పెద్ద అంబర్‌పేట్ పరిధిలోని కళానగర్ పోచమ్మ కాలనీకి చెందిన దంపతులకు వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు జన్మించినట్లు సమాచారం.

అయితే ఆ శిశువు పుట్టిన సుమారు రెండు నెలలకే రూ.1.10 లక్షలకు ఇతరులకు విక్రయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం బయటకు రావడంతో స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

పసికందును ఎవరికి విక్రయించారు? ఈ వ్యవహారంలో మధ్యవర్తులు ఎవరైనా ఉన్నారా? నగదు లావాదేవీ ఎలా జరిగింది? శిశువును తీసుకున్న వారి వివరాలు ఏమిటి? అనే అంశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే పసికందు విక్రయానికి సంబంధించిన ఆరోపణలు ప్రస్తుతం అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. శిశువు పరిస్థితి, తల్లిదండ్రుల పాత్రతో పాటు ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

దర్యాప్తు పూర్తయిన తర్వాతే పసికందు విక్రయంపై వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :