జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వికసిత భారత్ అంటూ ఉదరగొడుతూ
నరేంద్ర మోడీ 10 ఏళ్లు ప్రధానిగా2015 మార్చ్1 బడ్జెట్ నాటికి దేశ అప్పు 62 లక్షల కోట్లు అండగా పదేళ్ల లో ఎన్ డీ ఏ సాధించిన ప్రగతి 1,80,000 కోట్లు అని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా కనపడుతోంది
దేశ జీ డీ పీలో5శాతం సమకూర్చుతున్న తెలంగాణ కు నిధుల కేటాయింపుల్లో వివక్ష చూపారు. రాష్ట్ర విభజన హామీలు బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐ ఐ ఎం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ బడ్జెట్ లో ఉసే లేదు, తెలంగాణ ప్రజల హక్కులు కాపాడేందుకు రాజకీయాలు అతీతంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం తో సన్నిథంగా ఉంటు రాష్ట్రానికి నిధుల సాధన కోసం కృషి చేస్తున్న బడ్జెట్ లో తెలంగాణకు మోండీ చెయ్యి చూపారు. బీ ఆర్ ఎస్ బీజేపీ మధ్య సఖ్యత లేకపోవడం తో పదేళ్లు తెలంగాణ ప్రజలు తమ హక్కులు కోల్పోయారు. రింగ్ రోడ్డు, రే డియల్ రోడ్లు, మెట్రో రైలు, మూసి పునరుద్ధరణ పథకం ప్రాజెక్టుల కోసం 1లక్ష 63 వేల నిధుల కోసం ప్రతిపాదనలు పంపితే ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం తీవ్ర నిరాశకు గురిచేసింది. పసుపు బోర్డు ఏర్పాటు చేసుకున్న బడ్జెట్ లో కేటాయింపులు లేవు. ఆర్మూర్ నుండి అదిలాబాద్ రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే ఢిల్లీ ప్రత్యామ్నాయ మార్గం అయితది ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించకపోవడం తో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. యూపీ ఏ ప్రభుత్వ హయాంలో శంషాబాద్ ఏర్పోర్ట్ చేసినం.. ప్రస్తుత ప్రభుత్వం వరంగల్ ఏర్పోట్ కూడా ఏర్పాటు చేయలేదు. బడ్జెట్ లో తెలంగాణ అనే పదమే ఉచ్చరించకపోవడం తో దేశంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదనే కనీసఆలోచన అయిన కేంద్రానికి ఉన్నదా.. అని అనుమానం వస్తుంది. పీ ఏం ఆవస్ యోజన కింద గతంలో రు.30,171 కోట్లు కేటాయించి, ఈ ఏడాది 10 వేల కోట్లు తగ్గించారు.
రైతులను రుణ విముక్తులను చేసేందుకు యూ పీ ఏ హయాంలో జాతీయ స్థాయిలో రు.70 వేల కోట్లు మంజూరు చేసి, లక్ష రూపాయలు రుణమాఫీ చేసింది. తెలంగాణ రైతులను రుణ విముక్తులను చేసేందుకు 21 వేల కోట్లు కేటాయించింది.
రైతులను రుణ విముక్తులను చేసిన రాష్ట్రానికి కనీసం సహకారం అందించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. ఉపాధి హామీ నిధులు గతేడాది నిధులు కేటాయించారు. గ్రామీణ నిరుపేద వ్యవసాయ కూలీలు ఉపాధికి నిధులు పెంచకపోవడం ప్రధాని నరేంద్ర మోడీకి నిరుపేదల పై ఉన్న వివక్ష తెలుస్తోంది. మూసి పునరుజ్జీవం కు అనుకూలం అని చెప్తున్న బీజేపీ మంత్రులు కనీసం నిధులు కేటాయించలేకపోయారు. కేంద్ర బడ్జెట్ బీహార్ రాష్ట్ర బడ్జెట్ గా గోచరిస్తుంది. బడ్జెట్ పై వాస్తవాలు మాట్లాడాలి..రైతులకు, రైతు కూలీలకు అండగా నిలువాలి. బీజేపీ నాయకుల్లో సానుకూల దృక్పధం కొరవడింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శనాత్మక కోణంలోనే చూస్తున్నారు.
మెట్రో రైలు ఎంత ప్రదానమైనదో మంత్రి కిషన్ రెడ్డి కి తెలియదా..ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు తో అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు వచ్చింది. మామిడి ప్రోత్సాహానికి మామిడి బోర్డు ఏర్పాటు చేయాలి. రైతులకు అండగా నిలువాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ గెలుస్తాం.. తెలంగాణ రాష్ట్రంలో 55 వేల ఉద్యోగాలు భర్తీ చేసినం. ప్రభుత్వ విప్ ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..కేంద్ర బడ్జెట్ పై తెలంగాణకు నిధులు కేటాయించక పోవడం పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాం..రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్న నిధులు తీసుకు రాలేకపోయారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నప్పటి నుండి ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఉంటే ఆ రాష్ట్రానికి నిధులు కేటాయిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపులో అన్యాయం జరిగినా బీ ఆర్ ఎస్, బీజేపీ నోరు మెదపడం లేదని, కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి నిధుల కేటాయింపుల్లో వివక్ష పై జగిత్యాల జిల్లా కేంద్రంలో ఫిబ్రవరి 3న నిరసన కార్యక్రమం చేపడుతున్నామని, జిల్లా లోని కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని పిలుపునిచ్చారు.