అనంతపురం జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో వెలసిన శ్రీ బోలికొండ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన గోడపత్రికలను గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, తనయుడు గుమ్మనూరు ఈశ్వర్ చేతుల మీదుగా ఆలూరు లోని తమ స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 6వ తారీకు నుండి 14 వ తారీకు వరకు నిర్వహించు స్వామివారి బ్రహ్మోత్సవాలలో విచ్చేసిన భక్తాదులకు ఎటువంటి అసౌకర్యాలు కు గురి కాకుండా ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా 11, 12 తారీకుల్లో స్వామివారి కల్యాణోత్సవం, బ్రహ్మరథోత్సవం కు ఎక్కువగా విచ్చేసే భక్తాదులను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించాలని ఈవో రామాంజనేయులకు, ఆలయ కమిటీ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చిన్నారెడ్డి, మద్దిలేటి, రంగస్వామి రెడ్డి, పార్థా స్వామి తదితరులు పాల్గొన్నారు.
