జగిత్యాల జిల్లా, మెట్ పల్లి పట్టణంలోని కోణారావుపేట గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో గత కొన్ని రోజుల నుండి పేకాట స్థావరం ఏర్పరచుకొని కొంతమంది పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు.మెట్ పల్లి ఎస్సై కిరణ్ కుమార్ మరియు సిబ్బందితో కలిసి రెండు బృందాలుగా ఏర్పడి పేకాట ఆడుతున్న ప్రదేశాన్ని చుట్టుముట్టి పేకాట ఆడుతున్న 13 మంది వ్యక్తులను పట్టుకొని వారిలో ముష్కర కిషోర్ కథలాపూర్ మండలం కి చెందిన వ్యక్తి గత కొంతకాలంగా ఇతర ప్రాంతాల నుండి పేకాట ఆడిపిస్తూ వారి వద్ద డబ్బులు తీసుకొని ఆడిపించుచున్నాడని ఒప్పుకున్నాడు. 12 మందిని అదుపులోకి తీసుకొని పేకాట ఆడుతున్న వారి నుంచి రూ.65 వేల ఐదు వందల రూపాయలు మరియు వారి వద్ద నుండి 9 బైకులను 11 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మెట్ పల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి వారిపై కేసు నమోదు చేసి వారి వద్ద నుండి స్వాధీన పరుచుకున్న డబ్బులను బైకులను మొబైల్ ఫోన్లను కోర్టులో డిపాజిట్ చేసి వారిపై చర్య నిమిత్తం కోర్టులో హాజరు పడుచుదాం అని తెలిపారు. అదే విధంగా పట్టుబడిన వ్యక్తులు పుష్కర కిషోర్ తోడేటి చంద్రశేఖర్ కోరుట్ల కల్లెడ లక్ష్మీ నరసయ్య మోహన్ రావు పేట ముస్కర సంతోష్ కథలాపూర్ పెద్ద బోయిన శ్రీనివాస్ కోరుట్ల కందరి నరేష్ రెడ్డి సిరికొండ ఎండి రఫీ దిన్ కోరుట్ల గోపిడి కృష్ణారెడ్డి దూలూరు ఆర్య తిరుపతి లొత్తునూరు మార వెంకట్రెడ్డి సంగం మరియు కనుమల్ల లింగమూర్తి సుగుణాకర్ రావు జగిత్యాల చంద్రశేఖర్ రెడ్డి రాయికల్ గ్రామాలకు చెందినవారు వీరి అందరికీ ఆర్గనైజర్ గా పుష్కర కిషోర్ మరియు పెద్ద బోయిన శ్రీనివాస్ కలిసి ఫోన్ల ద్వారా పిలిపించుకొని పేకాట ఆడిపించుచున్నారు. మెట్ పల్లి సర్కిల్ పరిధిలో ఎక్కడైనా పేకాట ఆడినచో వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని.సీఐ నిరంజన్ రెడ్డి హెచ్చరించారు.
![](https://www.thereportertv.com/wp-content/uploads/2025/01/కనీసం-ఇద్దరు-పిల్లలుంటేనే-స్థానిక-ఎన్నికల్లో-పోటీకి-అర్హత-_-ఎపి-సీఎం-చంద్రబాబు.webp)