పల్నాడు జిల్లా, పిడుగురాళ్ళ : మున్సిపల్ కార్మికుల రాష్ట్ర పిలుపుమేరకు పిడుగురాళ్ళ ఐలాండ్ సెంటర్ వద్ద రిలే దీక్షల శిబిరం సిఐటియు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి తెలగపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 16 రోజులపాటు సమ్మె సందర్భంగా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేస్తామని ,రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు పెంచుతామని ,చనిపోయిన కార్మికులకు పరిహారం రెండు లక్షల రూపాయలకు పెంపుదల, ప్రమాదవశాత్తు మరణించినటువంటి కార్మికులకు ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకు పెంచుతూ అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్ ,సెమిస్కిల్ ప్రకారం వేతనాల అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది ప్రస్తుత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇవ్వాలని, వారికి రావాల్సినటువంటి పరిహారం వెంటనే ఇవ్వాలని ,యూనిఫాం, సబ్బులు, నూనెలు, చెప్పులు, ఇవ్వాలని , ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, ఎన్.ఎం.ఆర్, కోవిడ్ సమయములో పనిచేసిన కార్మికులకు జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, తదితర డిమాండ్లను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు మొగిలి ప్రతాప్, బత్తుల రామారావు, గుంటి నాగేశ్వరరావు, దేవరకొండ మార్తమ్మ, కంపా చిన్న వీరమ్మ కుంభ కృష్ణవేణి , దేవళ్ల వెంకటేశ్వర్లు ,గద్దె శ్రీను, కోపరి రమేష్ విజయ్, వేముల శ్రీనివాసరావు, కొక్కెర శ్రీనివాసరావు, కంపా సురేష్, రామయ్య ,రాగిరి శీను, హద్దులు, అనంతలక్ష్మి, కొమర గురవయ్య , పరస మేరీ, ప్రసన్న ,గ్లోరీ, అన్నపూర్ణ దేవి, మేరమ్మ తదితరులు పాల్గొన్నారు.