కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండల కేంద్రం మండల వనరుల కేంద్రంలో శుక్రవారం డిటిఎఫ్ క్యాలెండర్ ను మండల విద్యాధికారి ప్రధానోపాధ్యాయులు జడ్పిహెచ్ఎస్ గన్నేరువరం కె. రామయ్య చేతులమీదుగా డిటిఎఫ్ క్యాలెండర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శ్రీరాముల నరేందర్, ప్రధాన కార్యదర్శి బద్దం సురేందర్ రెడ్డి, డిటిఎఫ్ నాయకులు సాయి,శిరీష, మధు,బాలయ్య, లక్ష్మీరాజ్యం, లక్ష్మీనారాయణ, సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.