- అర్హులైన ప్రతి పేదవాడికి పట్టణంలో రెండు సెంట్లు పల్లెలో మూడు సెంట్లు రెండు ఎకరాల సాగు భూమి ఇవ్వాలి
- అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని అర్హులైన వారికి పంపిణీ చేయాలి
- సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డమాను వీరశేఖర్ డిమాండ్
కడప, బద్వేల్ :ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డమాను వీర శేఖర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా, శుక్రవారం ఉదయం 10 గంటలకు సిపిఐ బద్వేల్ మండల సమితి ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీర శేఖర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని అర్హులైన పేదలకు భూ పంపిణీ చేయాలన్నారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన 100 రోజులలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తామని కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసిందని, అయితే ప్రభుత్వం ఏర్పాటయి ఐదు నెలలు దాటిన ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇంటి స్థలాలు లేని నిరుపేదలకు పట్టణాలలో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాలలో మూడు సెంట్లు భూమిలేని అర్హులైన రెండు ఎకరాల సాగు భూమి పంపిణీ చేయాలన్నారు ఇప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ ఇళ్ల స్థలాలు, సాగుభూమి లేనటువంటి వారిని గుర్తించి వ్యక్తిగత అర్జీలు రెవిన్యూ అధికారులకు ఇవ్వడం జరిగిందని, ఇచ్చిన అర్జీలను పరిశీలించి అర్హుల జాబితాలో చేర్చాలని వారు.డిమాండ్ చేశారు అంతేకాకుండా ఇల్లు నిర్మిస్తున్న వారికి ఐదు లక్షలు ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు లేని పక్షంలో ఇండ్ల స్థలాలు సాగు భూములు అర్హులైన పేదవాళ్లకు ఇచ్చేంతవరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు ధర్నా అనంతరం తాసిల్దార్ దామోదర్ గారికి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు బద్వేలు మండల కార్యదర్శి నాగదాసరి ఇమ్మానుయేలు పట్టణ కార్యదర్శి బాలు జిల్లా సమితి సభ్యులు పడిగ వెంకటరమణ వ్యవసాయ కార్మిక సంఘం వేరే అధ్యక్షులు నాగరాజు మహిళా సంఘం ఏరియా కార్యదర్శి విజయమ్మ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సుబ్బారెడ్డి డిహెచ్ పిఎస్ మహిళా నాయకులు తిరుమల, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.