కరీంనగర్ జిల్లా: వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో గన్నేరువరం మండలం లోని గుండ్లపల్లి గ్రామంలో కస్టమ్ హైరింగ్ సెంటర్ పై సోమవారం రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రోటరీ క్లబ్ స్వచ్చంద సంస్థ ఎక్స్ ప్రెసిడెంట్ జ్వాలా మధుసుదన్ రెడ్డి సహకారం మరియు సేవాస్ఫూర్తి ఫౌండేషన్ యాజమాన్యంతో కలిసి గుండ్లపల్లి గ్రామాన్ని ఎంచుకొని ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కస్టమ్ హైరింగ్ సెంటర్ అంటే రైతులకు కావాల్సిన వ్యవసాయ పరికరాలను కిరాయికి ఇచ్చే సెంటర్.ఈ సెంటర్ లో రైతులకు అవసరమైన పనిముట్లు అందుబాటులో ఉంటాయని,వాటిని రైతులు కిరాయికి తీసుకువెళ్లి వాళ్ళ వ్యవసాయ పనులు చేసుకొని తిరిగి సెంటర్ కి అప్పగించవలసి ఉంటుందని. ఈ సెంటర్ తో సన్నా చిన్న కారు రైతుల అభివృద్ధి , గ్రామ అభివృద్ధి జరుగుతుందని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి,సేవ స్ఫూర్తి ఫౌండేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ జి.రత్నాకర్,ఏఈఓ కీర్తి కుమారి,గుండ్లపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.
