కరీంనగర్ జిల్లా: సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మానకొండూర్ శాసనసభ్యుడు డా. కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బుధవారం గన్నేరువరం మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆయన మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ఇళ్లు లేని నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు. ఈ పథకం కింద విడతల వారీగా అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగ జరుగుతుందని, ఇందులో అవకతవకలకు, అవినీతికి తావులేదని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో గూడులేని పేదలకు ఇళ్లు ఇవ్వలేదని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేస్తున్నదని ఆయన వివరించారు. నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేయడమే ఈ పథకం ఉద్దేశమని ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గన్నేరువరం మండల తహసీల్దార్ శ్రీనివాస్, ప్రత్యేకాధికారి రామానుజాచారి, పీడీ గంగాధర్, గృహనిర్మాణ సంస్థ ఏఈ మహేందర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, కొమెర రవీందర్ రెడ్డి, మాతంగి అనిల్, మార్గం మల్లేశం, చంద్రారెడ్డి తోపాటు వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
◆ పారువెళ్ల లో రెవెన్యూ సదస్సు
గన్నేరువరం మండలం పారువెళ్ల గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు పేరిట బుధవారం రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ శాసనసభ్యుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆధునిక వ్యవసాయ సాంకేతికతలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు.