గన్నేరువరం, కరీంనగర్ జిల్లా : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులు, పోలీసు సిబ్బందిని సత్కరించారు. కరీంనగర్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఈ పురస్కారాలను అందజేశారు.
గన్నేరువరం తహసీల్దార్ ఇప్ప నరేందర్, ఏపీఎం శ్రీనివాస్ తమ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ప్రశంసా పత్రాలకు ఎంపికయ్యారు. వీరికి మంత్రి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.
అదేవిధంగా గన్నేరువరం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ వి. భాస్కర్ రెడ్డికి ఉత్తమ సేవలను గుర్తిస్తూ ఉత్తమ సేవా పతకం అందజేశారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా ఆయన ఈ పతకాన్ని స్వీకరించారు.
విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో అవార్డులు అందుకోవడం పట్ల గన్నేరువరం మండలానికి చెందిన ప్రజలు, అధికారులు, పోలీసు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు అందుకున్న అధికారులు, హెడ్ కానిస్టేబుల్కు పలువురు అభినందనలు తెలిపారు.








