కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్‌కు కల్పించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం, గన్‌మెన్ల భద్రతను తొలగించవద్దని డిమాండ్ చేస్తూ కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో బీఆర్ఎస్ శ్రేణులు గురువారం ‘మహా ధర్నా’ నిర్వహించాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ప్రవీణ్ కుమార్ భద్రతను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా దీక్షలో పాల్గొన్న పార్టీ నాయకులు మాట్లాడుతూ, డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రత విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. గతంలో కల్పించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం, గన్‌మెన్ల భద్రతను ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని కోరారు. ప్రజా జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్న నాయకులకు భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రవీణ్ కుమార్‌కు ఉన్న భద్రతను తగ్గించడం లేదా తొలగించడం సరైన నిర్ణయం కాదని, ప్రభుత్వం వెంటనే దీనిపై పునరాలోచన చేసి భద్రతను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు.
ఈ మహా ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ప్రతినిధి నక్క మనోహర్, పార్టీ నాయకులు కొంగ సత్యం, ఇమ్మడి పోచం (కౌన్సిలర్), మాజీ కౌన్సిలర్ మిన్హాజ్, కాసిపాక రాజు, కాగజ్‌నగర్ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, కౌటాల మండల అధ్యక్షుడు బండు పటేల్, బెజ్జూర్ మండల అధ్యక్షుడు బుస్సా సారయ్య, చింతలమానేపల్లి మండల అధ్యక్షుడు లహంచు, పర్వతి అంజన్నతో పాటు వివిధ మండలాల అధ్యక్షులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








