కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఉగాదిని పురస్కరించుకొని శ్రీ శోభకృతు నామ సంవత్సరం శుభ సందర్భంగా శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలో భాగంగా ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యములుగా ఉండాలని సకల వ్యాపారములు దిన దినభిరుద్ది జరగాలని నవగ్రహ దోషములు పోయి ప్రజలందరూ కూడా సుఖసంతోషములతో ధనకనక వస్తూ వాహనాలతో ఉండాలని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి పంచామృతములతో, విశేష ద్రవ్యములతో అభిషేకములు నిర్వహించి .అనంతరం నూతన సంవత్సర మహా పర్వదినం సందర్భంగా పురాయితులు మణిశంకర్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు, కార్యక్రమంలో గన్నేరువరం ఉప సర్పంచ్ ఉప సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు బూర వెంకటేశ్వర్, సింగిల్ విండో డైరెక్టర్ బోయిని అంజయ్య, కారోబార్ జువ్వాడి మాధవరావు, బోయిని పోశయ్య, బొడ్డు బాలయ్య,శ్రీ లక్ష్మీనరసింహస్వామి అర్చకులు యాదగిరి,దేశరాజు అనిల్, మునిగంటి సంతోష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు
