- జంగపల్లిలో కొడుకు చేతిలో తండ్రి హతం
- భూవివాదమే హత్యకు కారణమా?
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామంలో కొడుకు చేతులో తండ్రి హతమయ్యాడు. గ్రామానికి చెందిన అట్టికం శంకరయ్య అతని కుమారుడు అట్టికం రవికుమార్ భూమికోసం ఇంట్లోనే క్రికెట్ బ్యాట్ తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వెంటనే కుటుంబ సభ్యులు స్థానికులు చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. మృతుడు శంకరయ్యకు 20 ఎకరాల భూమి ఉండగా అందులో కొంత భూమిని కూతురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని కోపంతో కొడుకు ఈ ఘాతకానికి పాల్పడినట్లు తెలుస్తుంది.