శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల తిరుపతి తెలుగు శాఖ ఆధ్వర్యంలో కవి చక్రవర్తి గుర్రం జాషువా 129వ జయంతి సభను చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు కళాశాల అధ్యక్షులు ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి , ముఖ్య వక్తగా ప్రొఫెసర్ పిసి వెంకటేశ్వర్లు డైరెక్టర్ ఓ ఆర్ ఎల్ , ఎస్ వి యు , ముఖ్య అతిథులుగా కళాశాల ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ భాస్కరుడు , తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ భీమన్న , మరియు అధ్యాపకులు అసిస్టెంట్ ప్రొఫెసర్ మేడికొండ ప్రసాదరావు , సీనియర్ లెక్చరర్స్ డాక్టర్ లోకనాథ్ మందడి , జి వెంకటేశ్వర్లు , డాక్టర్ మునిస్వామి ఆచారి , డాక్టర్ తేజవాణి లు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.