contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

డ్రగ్స్ ఘటనలో నిహారికకు సంబంధం లేదు: నాగబాబు

హైదరాబాద్‌:-పబ్‌లో డ్రగ్స్ ఘటనకు సంబంధించి తన కుమార్తె నిహారికకు అలాంటి సంబంధం లేదని నటుడు నాగబాబు స్పష్టం చేశారు.

దయచేసి అవాస్తవాలు ప్రచారం చేయవద్దని ఆయన ఓ వీడియో విడుదల చేశారు.

‘‘పబ్‌లో డ్రగ్స్‌ ఘటనపై నేను స్పందించడానికి ప్రధాన కారణం ఆ సమయానికి నా కుమార్తె అక్కడ ఉండటమే.

పబ్‌ను సమయవేళల పరిమితికి మించి నడిపారని పోలీసులు చర్యలు చేపట్టారు.

ఇందులో నా కుమార్తె నిహారికవైపు ఏ తప్పూ లేదు.

నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు కూడా చెప్పారు.

మీడియాలో అవాస్తవాలకు తావు ఇవ్వకూడదనే నేను స్పందిస్తున్నా’’ అని నాగబాబు వెల్లడించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :