బంజారాహిల్స్ ర్యాడిసన్ డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది. పోలీస్ ఉన్నతాధికారులు సీఐ శివచంద్రను సస్సెండ్ చేశారు. ఏసీపీ సుదర్శన్ కు చార్జ్‌మెమో జారీ చేశారు. పుడింగ్ పబ్ లో విచ్చల విడిగా డ్రగ్స్ వాడుతుండటంతో పక్కా రెక్కీ నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున దాడులు చేశారు.
కొకైన్ తీసుకుంటున్నట్లు సమాచారం రావడంతో మఫ్టీలో వెళ్లారు పోలీసులు. వారిని గమనించి ఎక్కడ డ్రగ్స్ అక్కడే పడేశారు మత్తుగాళ్లు. ఈ పార్టీలో ప్రముఖుల పిల్లల పేర్లు వినిపిస్తున్నాయి.
సుమారు 150 మందిని పట్టుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించింది టాస్క్ ఫోర్స్. పట్టుబడిన వారిలో 39 మంది యువతులు ఉన్నారు. వారిలో కొందరు ప్రముఖుల పిల్లలు ఉన్నారు. పట్టుబడిన వారిలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నాగబాబు కుమార్తె నిహారిక, గల్లా జయదేవ్ కుమారుడు, మాజీ డీజీపీ కుమార్తె, హేమ సహా పలువురు ఉన్నారు.
ఇక్కడ తరచూ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నాయని సమాచారం రావడంతో పోలీసులు.. పక్కా స్కెచ్ గీసి ఎంటర్ అయ్యారు. అందర్నీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హోటల్ సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు.