విజయనగరం జిల్లా: బాడంగి మండలం డోంకినవలస గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ శిబిరం లో పశువులకు నట్టల నివారణ, వ్యాధి నిరోధక టీకాలు, గర్భకోశ వ్యాదులకు పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో డోంకినవలస సర్పంచ్ బొంకూర్ సింహాచలం అమ్మ, వైసీపీ కన్వీనర్ గండి శంకర్రావు, యాక్టివిటీ సర్పంచ్ పెంట రామకృష్ణ, (వి ఏ ఎఫ్ ) ఎం సతీష్ కుమార్ , ( వి ఏ ఎస్ ) వి సంతోష్ కుమార్ నాయుడు, గ్రామస్తులు, రైతులు, పసు వైద్య శిబిరం సిబ్బంది పాల్గొన్నారు.
