పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార యత్నం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి పోలీసువారిని ఆశ్రయిస్తే దాచేపల్లి సిఐ పట్టించుకోకుండా మూడుగంటల వరకు పోలీస్ స్టేషన్ కూర్చోబెట్టి తగు చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసి పంపారని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నాడు. తరువాత న్యాయం కోసం మీడియా మిత్రులను కలిసిన విషయం తెలిసిన దాచేపల్లి సిఐ షేక్. బిలాలుద్దీన్ ప్రెస్ మీట్ పెట్టి సంఘటన పై వివరణ ఇచ్చినట్టు తెలిస్తోంది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

								
								








