పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ బజారులోని గుప్తా కాంప్లెక్స్ వద్ద మహిళ పెట్రోలుతో ఆత్మహత్య యత్నానికి పాలుపడింది. వైసీపీ పట్టణ అధ్యక్షుడు చింత రామారావు రాజకీయ కక్షతో డబ్బులుకు అమ్ముడుపోయి తన రేషన్ షాపును వేరే వారికి ఇస్తున్నారని , నేను బిసి మహిళను కాబట్టే నాకు అన్యాయం చేస్తున్నారని, మా పిల్లలపై అక్రమ కేసులు పెట్టి మానసికంగా హింసిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో నాకు ఆత్మహత్యే శరణ్య మని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. సంఘటన స్థలానికి చేరుకున్న ఎసై అమీర్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించినట్టు వీడియో లో చూస్తున్నాము. మహిళా పోలీసులు లేనట్టు, మహిళలంటే గౌరవం లేకుండా దురుసుగా ప్రవర్తించండం సరికాదని పోలీసులు గమమించాలలి.