contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దివ్యాంగులకు పెంచిన పెన్షన్ చెక్కుల పంపిణీ

సిద్దిపేట జిల్లా : ది రిపోర్టర్ టీవీ : బెజ్జంకి మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక సత్య అర్జున ఫంక్షన్ హాల్లో మానకొండూర్ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర సంస్కృతిక సారధి చైర్మన్ డాక్టర్ రసమయి బాలకిషన్ మండల అధికారులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దివ్యాంగులకు పెంచిన పెన్షన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతూ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గతంలో 3016రు, ఉన్న పెన్షన్ను ఇప్పుడు4016రు, అలాగే2016రు,3016రు, కు పెంచుతూ దివ్యాంగులు మరియు వృద్ధుల జీవితాలలో వెలుగులో నింపారని పేర్కొన్నారు. దేశంలో 16 రాష్ట్రాలలో 1000రు, మాత్రమే పెన్షన్ వస్తుందని కానీ మన రాష్ట్రంలో4016రు ఇస్తున్నామని తెలిపారు. అలాగే మన ముఖ్యమంత్రి కెసిఆర్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం ఒకవైపు సంక్షేమం మరొకవైపు అభివృద్ధిలో దేశంలోనే ముందుకు దూసుకెళ్తుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్, ఎంపీడీవో, వివిధ అధికారులు, బెజ్జంకి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాలమహిపాల్ రెడ్డి, స్థానిక ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్, జెడ్పిటిసి కనగండ్ల కవిత తిరుపతి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు బేగంపేట్ సర్పంచ్ చింతలపల్లి సంజీవరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దుంబాల రాజ మహేందర్ రెడ్డి, మండల బీఆర్ఎస్ చేరికల కమిటీ సభ్యులు చింతకింది శ్రీనివాస్ గుప్తా, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చు చంద్రకళ రాజయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, సోషల్ మీడియా ఇంచార్జ్ ఎలా శేఖర్ బాబు, నాయకులు మేకల శ్రీకాంత్, ఎలుక దేవయ్య, బిగుల్ల మోహన్, తాళ్లపల్లి రాము, బిగుల సుదర్శన్, వంగ నరేష్, బెజ్జంకి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :