contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

సెల్ఫ్ ఎన్యుమరేషన్ పూర్తి చేసుకోవాలి : ఆర్డీఓ జయచంద్రారెడ్డి

తూప్రాన్/మెదక్ :  గురువారం నాడు ఆర్డీఓ కార్యాల యంలోని సిబ్బంది అంతా Census Self Enumeration ప్రక్రియను పూర్తి చేసుకున్నారని ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చివరిసారిగా 2011లో జనగణన నిర్వహించబడిందని, దాదాపు 15 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు జనగణన ప్రక్రియ ప్రారంభ మవుతోందన్నారు. ఈ జనగణనను రెండు దశల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11వ తేదీ నుండి ఇళ్లకు సంబంధించిన వివరాలను సేకరిస్తారని, తర్వాత వచ్చే సంవత్సరం జనాభా లెక్కల వివరాలను నమోదు చేస్తారని వెల్లడించారు.

ప్రజలు ఎవరికి వారు స్వయంగా ఆన్‌లైన్ https://se.census.gov.in/Self Enumeration వెబ్ సైట్ ద్వారా చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. ఇది చాలా సులభమైన ప్రక్రియ అని తెలిపారు. అందరూ ఈ నెల 10వ తేదీ లోపు తప్పనిసరిగా Self Enumeration పూర్తి చేసుకోవాలని సూచించారు. మన వివరాలను మనమే నమోదు చేసుకుంటే ఎలాంటి పొరపాట్లు జరిగే అవకాశం ఉండదన్నారు. ఆన్‌లైన్ Self Enumeration ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని, తర్వాత 11వ తేదీ నుండి Enumerators ప్రతి ఇంటికి వచ్చి వివరాలను నమోదు చేస్తారని ఆర్డీఓ జయ చంద్రా రెడ్ది తెలిపారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :