contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వెలిగండ్లలో ఘనంగా విద్యార్థుల సైకిల్ ర్యాలీ

వెలిగండ్ల: 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వాతంత్ర్య దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా వెలిగండ్ల మండల కేంద్రంలో గురువారం దేశభక్తి ఉప్పొంగింది. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది కలిసి భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

వెలిగండ్ల సబ్‌ ఇన్‌స్పెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై సైకిల్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జాతీయ జెండాలను చేతబూనిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలు ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ సాగడంతో మండల కేంద్రంలో సందడి నెలకొంది.

అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రాముఖ్యతను ఉపాధ్యాయులు వివరించారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు ఎందరో స్వాతంత్ర్య సమరయోధులు చేసిన పోరాటాలు, చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. వారి త్యాగాల ఫలంగానే నేడు మనం స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని పేర్కొన్నారు.

స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎస్సై, ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ సిబ్బంది, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :