contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

30వ రోజుకు చేరుకున్న వివోఎ నిరవధిక సమ్మె – సంఘీభావం తెలిపిన బీజేపీ నాయకులు గడ్డం నాగరాజు

కరీంనగర్ జిల్లా:మానకొండూరు నియోజకవర్గం లోని ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఐకెపి వివోఎ ల నిరవధిక సమ్మె 30వ రోజు చేరుకున్న సందర్భంగా అట్టి నిరవధిక సమ్మెలో భారతీయ జనతా పార్టీ మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ గడ్డం నాగరాజు పాల్గొని సంఘీభావం తెలియజేశారు. అనంతరం గడ్డం నాగరాజు మాట్లాడుతూ 2014 ఎన్నికలకు ముందు సీఎం కెసిఆర్ విఓఏ లకు 10 వేల గౌరవ వేతనం ఇస్తామని అన్నారని గుర్తు చేశారు. తెలంగాణ లో కాంట్రాక్టు అనే మాట వినపడవద్దు అని మాట్లాడిన కెసిఆర్ కి రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగస్తులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహిళా సాధికారత అని గొప్పలు చెప్పుకొనే తిరిగే నాయకులకు ఈ మహిళలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ఐకెపి విఓఏ ల సమస్యలు పరిష్కరించాలని , వివోఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం 18 వేల ఇవ్వాలని, 10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా కల్పించాలని సేర్ఫ్ నుండి ఐడి కార్డులు ఇవ్వాలని, గ్రామ సంఘం గ్రేడింగ్ తో సంబంధం లేకుండా ప్రతినెలా వేతనాలు వ్యక్తిగత ఖాతాలకు చెల్లించాలని, అర్హులైన విఓఏ లను సిసి లుగా ప్రమోషన్ కల్పించాలని, విఒఎలు డిమాండ్ చేస్తున్నారని దీనికి మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే విఓఏ ల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని గడ్డం నాగరాజు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో మండల అధ్యక్షులు నాగసముద్రాల సంతోష్ బిజెపి నాయకులు
సీనియర్ నాయకులు మ్యాకల మల్లేశం,ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులడు గజ్జెల శ్రీనివాస్,దళిత మోర్చ మండల ప్రధాన కార్యదర్శి మామిడి శేఖర్,దొనపాటి సంపత్,ఎలుక వర్ధన్, గొఱ్ఱె అఖిల్ లు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :