contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాకిస్తాన్ – పంజాబ్‌ తొలి మహిళా సిఎంగా చరిత్ర సృష్టించిన మహిళ

Pakistan : పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రానికి తొలి మహిళా సిఎంగా పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌ – నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌) పార్టీ అభ్యర్థి మర్యమ్‌ నవాజ్‌ చరిత్ర సృష్టించారు. ఆమె పంజాబ్‌ అసెంబ్లీలో తన ప్రత్యర్థి సున్నీ ఇత్తెహాద్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఐసి)కి చెందిన రాణా అఫ్తాబ్‌పై ఆమె విజయం సాధించింది. అసెంబ్లీలో ఎస్‌ఐసి సభ్యుల బహిష్కరణ కారణంగా రాణా అఫ్తాబ్‌కి ఒక్క ఓటూ పడలేదు. దీంతో 220 ఓట్లను సాధించి.. పూర్తి మెజారిటీతో మర్యమ్‌ సిఎంగా ఎన్నికయ్యారు.

కాగా, ఈరోజు కొత్తగా ఎన్నికైన స్పీకర్‌ మాలిక్‌ అహ్మద్‌ఖాన్‌ అధ్యక్షతన జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ సెషన్‌లో సున్నీ ఇత్తెహద్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఐసి)కి చెందిన ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీని వాకౌట్‌ చేశారు. అసెంబ్లీని బహిష్కరిస్తున్న సభ్యులను తిరిగి అసెంబ్లీకి వచ్చేలా ఒప్పించేందుకు స్పీకర్‌ ఖాన్‌ ఖవాజా సల్మాన్‌ రఫీక్‌, సల్మాన్‌ నజీర్‌, సమీవుల్లా, ఖలీల్‌ తాహిర్‌ సింధులతో సహా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. సిఎం అభ్యర్థిగా మర్యమ్‌ నవాజ్‌ని స్పీకర్‌ ప్రకటించారు. అయితే పిఎంఎల్‌-ఎన్‌ పార్టీకి అసెంబ్లీలో తగినంతమంది సభ్యుల మెజారిటీ ఉండడం వల్ల ఆమె తన ప్రత్యర్థి రాణా అఫ్తాబ్‌పై గణనీయమైన మెజారిటీతో విజయం సొంతం చేసుకున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :