contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

చెన్నూరు శివారు అసైన్మెంట్ భూమిని భూకబ్జాదాల నుంచి కాపాడాలి:సిపిఎం

  • చెన్నూరు శివారు అసైన్మెంట్ భూమిని భూకబ్జాదాల నుంచి కాపాడాలి..అట్టి భూమిని ఇల్లు లేని పేదలకు పంచాలని… మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం ఇచ్చిన సిపిఎం బృందం.
  • బాబురావుపేటశివారులోని సర్వే నంబర్ 8 లో గల 27 ఎకరాల అసైన్మెంట్ భూమిలో నిజమైన సాగుదారులు లేనందునా రీ అసైన్మెంట్ చేసి పేదలకు ఇంటి స్థలాలుగా పంచాలి.
  • ప్రభుత్వ,అసైన్మెంట్ భూములను కబ్జాలు చేసుకొని అమ్ముకుంటున్న వారికి పోలీస్ కేసులు,బైడవర్లు వర్తించవా ?
  • కొంతమంది అధికార పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లే అసైన్మెంట్,ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు
  • పైళ్ళ అశయ్య CPM రాష్ట్ర కమిటీ సభ్యులు

మంచిర్యాల జిల్లా చెన్నూరు మండల పరిధిలోని బాబురావు పేట శివారు సర్వేనెంబర్ 8లో 27 ఎకరాల భూమి ప్రభుత్వం అసైన్మెంట్ చేసి పేదలకు ఇవ్వడం జరిగింది. ధనవంతుల,భూ కబ్జాదారుల ఆగడాలు భరించలేక అప్పటినుండి ఇప్పటివరకు పేదలు భూమిలో సాగులో లేరు. మొత్తం అసైన్మెంట్ భూమి అంత నేడు అధికార పార్టీ కౌన్సిలర్లు కబ్జాలు చేసి ప్లాట్లు వేసి అమ్ముకోవడం జరుగుతుంది.ప్రభుత్వ భూమిని కాపాడి పేదలకు పంచాలని సిపిఎం నాయకత్వంలో పేదలు గత ఐదు రోజులుగా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని పోరాటం చేస్తున్నారు. 27 ఎకరాలు ప్రభుత్వ భూమి అయినప్పటికీ స్థానిక అధికారులు ఇట్టి భూమిని ఇళ్లస్థలాలకు పంచకుండా ధనవంతులకు, కబ్జాలదారులకు అమ్ముడుపోయి ఏమి తెలవనట్లుగా ఉంటున్నారు. పైగా ప్రభుత్వ బోనాలు కాపాడడానికి పోరాటం చేస్తున్న పేదలపైన, వారిపోరాటనికి మద్దతు తెలిపిన నాయకులపైన అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో పోలీస్ వారు అక్రమ కేసులు,బైండోవర్ కేసులు పెట్టి బెదిరింపులకు గురి చేయడం జరుగుతుంది. మరో ప్రక్క  అధికార పార్టీ కౌన్సిలర్లు పోరాటం చేస్తున్న పేదలను బెదిరించడం జరుగుతుంది. కబ్జా దారుల నుంచి అసైన్మెంట్ భూమిని ప్రభుత్వం,అధికారులు కాపాడకపోతే పేదలే కాపాడుకుంటారు.
1,సర్వే నం.8 గల భూమిలో అసైన్డ్ మెంట్ హాక్కుదారులు లేనందున రీ అసైన్డ్ మెంట్ చేసి పేదలకు ఇంటి స్థలాలుగా పంచాలి
2,పేదలపై,నాయకులపై పెట్టిన అక్రమ కేసులను,బైండవర్లను ఎత్తివేయాలి.  ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు
సంకే రవి సీపీఎం జిల్లా కార్యదర్శి, దాసరి రాజేశ్వరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు,బోడెంకి చందు జిల్లా కమిటీ సభ్యులు,MD అవేజ్ చెన్నూర్ పట్టణ కార్యదర్శి,మరియు ఇండ్ల స్థలాలు పోరాట పేదలు శ్రీనివాస్, రేణుక,మణి, సంధ్యరాణి,నషిన, శారద రాజేశ్వరి, సలీమ,రమ్య,  పోశక్క,ఉమరాణి, మల్లేశ్వరి,మరియు పేదలు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :