contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దాతృత్వం చాటుకున్న పూర్వ విద్యార్థులు

పల్నాడు జిల్లా కారంపూడి :  స్థానిక బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన 2001 – 2002 బ్యాచ్ కు చెందిన పూర్వ విద్యార్థులు తమ దాతృత్వాన్ని చాటుకున్నారు . తమతో కలిసి చదువుకున్న సహా విద్యార్థి సూరె సందీప్ ఆరోగ్యం సరిలేదన్న సమాచారాన్ని విద్యార్థులు తెలుసుకున్నారు . తమ తోటి పూర్వ విద్యార్థి కి సహాయము చేయాలనీ తలచిన విద్యార్థులు రూ 50 వేలు పోగుచేసారు . తమ కు విద్య పాఠాలు నేర్పిన గురువు రంగయ్య మాస్టర్ చేతుల మీదుగా సందీప్ కు తామంతా చదువుకున్న పాఠశాల లోనే ఆ నగదును అందించారు .భవిష్యత్ లో మరింత సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సందీప్ కు ధైర్యాన్ని ఇచ్చారు . ఈ కార్యక్రమంలో వీరబాబు, ఏడుకొండలు, నాగేశ్వరరావు, బాజీ, బాలునాయక్, కృష్ణంరాజు, మీరా,మానసింగ్ నాయక్ , హేమ బాల కుమార్ పాల్గొన్నారు .

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :