పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం ఎమ్మెల్యే యరపతినేని పై జరుగుతున్న రాజకీయ కుట్ర రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారబోతుంది. ఆయనను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న పరిణామాలు “పూర్తిగా ఆర్గనైజ్డ్ పాలిటికల్ కాన్స్పిరసీ” అని విశ్వసనీయ సమాచారం. ఆయననే కాదు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ కుట్రను భగ్నం చేసుకోవలసిన భాద్యత ఆ నాయకులది, పార్టీ ప్రధాన అనుచరులది. కానీ ఇక్కడేమి జరుగుతుంది కింది స్థాయిలో ఉన్న కొందరు నాయకులు కాసులకు కక్కుర్తి పడో లేక ఫిరాయింపుల మీద వచ్చిన నాయకుల్లో కొందరు కుట్ర పన్ని సున్నిత అంశాలపై విషం చిమ్ముతూ … ప్రధాన వ్యక్తులను ఆ వ్యక్తి కి దూరం చేసే విధంగా పన్నాగాలు పన్ని కుట్ర చేస్తున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ విష బీజం మెల్లిగా మెల్లిగా వారిని అంతమోదిస్తుంది.
అదే తరహాలో పిడిగురాళ్ళ సిఐ వెంకట్ రావు యొక్క గుట్టు రట్టయింది. గత కొద్దికాలంగా ఈ యన చేస్తున్న అక్తృత్యాలకు స్థానిక నాయకుల్లో కొందరు అండగా ఉన్నారు. వీరు సైకలాజికల్ గేమ్ ఆడుతున్నారు.. వీరి గుట్టు రట్టు చేయడానికి రిపోర్టర్ టివి పన్నిన వలలో సిఐ వెంకట్ రావు , మరి కొందరు కూటమి నాయకుల గుట్టు బట్టబయలైంది. “ఇది సహజమైన పరిణామం కాదు. ముందే రాసిన ప్లాన్ ప్రకారం జరుగుతోంది. ఎమ్మెల్యే ఇమేజ్ దెబ్బతీయడమే లక్ష్యం.” ఈ కుట్రలో భాగమైన సిఐ వెంకట్ రావు కి ఒక వైసిపి ముఖ్య నేత కి సంబంధం ఉందా లేదా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదే ! ..
రానున్న రోజుల్లో ఎమ్మెల్యే ముఖ్య, నమ్మకమైన అనుచరులను దూరం చేయడం. వారిని ఎమ్మెల్యే దగ్గర చెడు చేయడం. వారి పై తప్పుడు కేసులు పెట్టడం. వారిని హింసించడం. లాఠీలకు పని పెట్టడం. అయినా వినకపోతే కీలక కేసులలో ఇరికించడం… ఇటువంటి రాజకీయ ప్రయోగాలు మరెన్నో ఉన్నాయి. కావున అప్రమత్తంగా ఉండాల్సింది ముఖ్య నాయకులే … జర భద్రం … ఎమ్మెల్యే సార్.










