contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అంబరాన్నంటిన జగనన్న జన్మదిన సంబరాలు

తిరుపతి : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి ఆదేశాల మేరకు అక్షయ క్షేత్రం నందు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుపేద ప్రజల అభిమాన నాయకుడు పేదల సన్నిధి ,పేద విద్యార్థుల పాలిట విద్యా పెన్నిధి ,రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అని డాక్టర్ బి ఓబుల్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరి చేత అందరి అభిమానం చూరగొన్న ప్రజానాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని అక్షయ క్షేత్రం నందు వైయస్సార్సీపి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లు మిఠాయిలు బ్రెడ్స్ దివ్యాంగులకు మరియు వృద్ధులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు చెంగల్ రెడ్డి, తిరుపతి రూరల్ ప్రార్థి విభాగం అధ్యక్షుడు గూడూరు రఫీ మాట్లాడుతూ విద్యార్థుల యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో పథకాలను గత ఐదు సంవత్సరాలలో ప్రవేశపెట్టారు .రాష్ట్రంలో సంక్షేమ పాలన నిర్వహణ అద్భుతంగా ఉండే విధంగా దేశం యావత్తు అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా పరిపాలించారు . చంద్రగిరి మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు అధ్యక్షుడు వినోద్ కుమార్. రామచంద్రపురం మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడు యశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతోమంది పేద, బలహీన, మధ్యతరగతి వర్గాల ,వివిధ కులాల మతాలకు ,అతీతంగా విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన ,వసతి దీవెన ,పథకాలతో విద్యార్థి లోకానికి దేవుడయ్యారు. రాష్ట్రంలో నవరత్నాలను ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల రైతులు, శ్రామికులు ,కర్షకులు, అందరికీ అనేక సంక్షేమ పథకాలను అందించి దేశంలోనే ఎంతో గొప్ప సీఎంగా పేరు తెచ్చుకున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యదర్శి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు నేతలకు అభిమాన నాయకుడిగా అతి చిన్నవయసులోనే ఎదిగిన తీరును ఎంతోమంది ప్రశంసించారు. ఆయన పరిపాలన విధానం దేశంలోని మహానేతలకు సైతం ఆదర్శంగా నిలుస్తుందన్నారు.గతంలో రాష్ట్ర ఆదాయాన్ని పెంపొందించడంలోనూ, బడ్జెట్ను నిర్వహించడం లోనూ, ఆయన మేధావితనం, తెలివితేటలు ,చాతుర్యం అపరచానిక్యుని మించిపోయారని కొనియాడారు .నేడు అక్షయ క్షేత్రం నందు వృద్ధులు మరియు దివ్యంగుల మధ్య జగనన్న జన్మదినం ఎంతో ఆర్భాటంగా ఉత్సాహంగా కేకులు కట్ చేసి పండ్లు,రొట్టెలు ,మిఠాయిలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘ నేతలు చంద్రగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ సెందిల్ కుమార్, మనీ,వెంకటేష్. వెంకటరామిరెడ్డి,భార్గవ్, తేజ రెడ్డి, చందు,రామ్, జగదీష్,సుభాన్, బి,కిరణ్,మధు, భూపాల్,శ్రీనివాసులు, రామకృష్ణ, విజయ్,ప్రశాంత్, నాగ వెంకటేష్,సాహిల్, నబి,నితీష్,ముజఫర్,మోహన్. ముజఫర్. తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :