అనంతపురం జిల్లా గుత్తి మండలం మోడల్ ఫౌండేషన్ స్కూల్ జక్కలచెరువు RS గ్రామం నందు గల అంగన్వాడీ కేంద్రంలో విద్యను అభ్యసించే విద్యార్థులకు గుత్తి అగ్రికల్చరల్ మార్కెటయార్డ్ చైర్మన్ ప్రతాప్ మిత్ర బృందం హనిమేష్, శ్రీనివాసులు, హరి, కళ్యాణ్ 25వేల రూపాయల విలువచేసే 25 జతల యూనిఫామ్స్ ను సీడీపీఓ భారతి ఆధ్వర్యంలో చిన్నారుల తల్లులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా సీడీపీఓ మాట్లాడుతూ ప్రభుత్వం అనంతపురం జిల్లాలో గుత్తి మండలం జక్కలచెరువు గ్రామంలో అంగన్వాడి పాఠశాలను ఏకైక మోడల్ ఫౌండేషన్ పాఠశాలగా ఎంపిక చేసి, ప్రత్యేక వసతులు సమకూర్చడమైనదని తెలిపారు. చిన్నారులకు యూనిఫార్మ్స్ ను సమాకూర్చిన గ్రామస్తులు కు విద్యపై ఉన్న వారి అభిరుచిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ దస్తగిరమ్మ, ప్రధాన ఉపాధ్యాయుడు కేశవ నాయుడు, అంగన్వాడీ కార్యకర్తలు రామాంజనమ్మ, శారద, విజయమ్మ, గౌరీ, రాజేశ్వరి, రమీజా చిన్నారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.









