contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పని ఒత్తిడి తో ప్రాణాలు కోల్పోతున్న సచివాలయ ఉద్యోగులు

తిరుపతి : అధిక ఒత్తిడి ఎదుర్కొని రెండు నెలల కాలవ్యవదిలో పదుల సంఖ్యలో ఉద్యోగులు గుండెపోటు రోడ్డు ప్రమాదాలు మరియు ఆత్మ హత్య చేసుకొని చనిపోయారు వారందరికీ అశ్రు నివాళి అర్పిస్తూ తిరుపతి నగరంలొ స్వర్ణ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు తోట కూర కోటేశ్వరరావు మరియు తిరుపతి సచివాలయ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో క్రొవొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ సచివాలయం లొ వివిధ రకాల సర్వేలు మాతృ శాఖలవారి విధులు ఐ వి ఆర్ ఎస్ ఫీడ్ బ్యాక్ బి ఎల్వో విధులు ప్రతి పనికి టార్గెట్స్ విధించడం సెలవు మరియు పండుగ రోజుల్లో విధులు నిర్వహించమని హుకుం జారీ చేయడం ఆఫీస్ పని గంటల్లో కాకుండా ఉదయం సాయంత్రం సర్వేలు చేయాలి అని ఒత్తిడి చేయడం రోజు వారి ఉద్యోగ విధులకు లొకేషన్ జియో ట్యాగ్ ఫొటోస్ పంపమని వీడియో కాల్స్ చేయడం వంటి చర్యలు వలన సచివాలయ ఉద్యోగులు నిత్యం మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారని

సచివాలయ ఉద్యోగులు పై చూపుతున్న వివక్ష ను తొలగించి ఒత్తిడి లేని ఉద్యోగ జీవితం ఉండేలా చర్యలు చేపట్టాలి లేనిచో ఉద్యోగులు తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారు.కావునా ప్రభుత్వ పెద్దలు ఉన్నత అధికారులు క్షేత్ర స్థాయి వాస్తవాలు అర్థం చేసుకొని విధులు కేటాయించాలి అని పేర్కొన్నారు

ఈ కార్యక్రమంలో నాగ మోహన్ విద్యాసాగర్ ప్రసాద్ మోహన్ కుమార్ సుబ్రహ్మణ్యం పూర్ణచంద్ర నవీన్ రాజా అలీ అక్బర్ ప్రసాద్ దిలీప్ నరేంద్ర సిద్దు మురళి మస్తానప్ప జైపాల్ అమరావతి శాంతి ప్రియ తేజోవతి గీత రజని కుమారి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :