contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

హోటళ్లలో గృహా సిలిండర్లు వాడితే కఠిన చర్యలు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో నడుస్తున్న ప్రైవేట్ హాస్టల్స్, టిఫిన్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేపట్టారు.

తనిఖీల సందర్భంగా వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం సుమారు 51 గృహ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, గృహ వినియోగానికి మాత్రమే అనుమతించబడిన సిలిండర్లను వ్యాపార అవసరాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. ఈ చర్యలతో ప్రభుత్వానికి నష్టం కలగడమే కాకుండా భద్రతాపరమైన ప్రమాదాలు కూడా సంభవించే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.

సంబంధిత యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని తెలిపారు.

స్థానిక ప్రజలు అధికారుల చర్యలను స్వాగతిస్తూ, అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :