కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలకేంద్రంలో యువసేవ కార్యాలయంలో వివేకానంద యూత్ అధ్యక్షుడు గూడూరి సురేష్ ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం
చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
చత్రపతి శివాజీ పోరాట స్ఫూర్తితో గన్నేరువరం ప్రాంత అభివృద్ధి, సమస్యలపై పోరాటం ప్రాంతం కోసం పోరాడటంలో శివాజీ మాకు స్ఫూర్తి అని అన్నారు. మండల కేంద్రంలో భారీ చత్రపతి శివాజీ విగ్రహం స్థలం కోసం ఇటీవల గన్నేరువరం గ్రామపంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు.
గన్నేరువరం గ్రామ యువకుల కోసం ఉన్నత ఉద్యోగాల కోసం చదువుకోడానికి ప్రిపేర్ కావడానికి యువసేవ కార్యాలయంలో మార్చి మొదటి వారంలో గ్రంథాలయం ప్రారంభిస్తామని తెలిపారు. ఎవరైనా జన్మదిన వేడుకలకు ఒక బుక్కును బహుమతిగా యువసేవ కార్యాలయనికి అందించాలనీ కోరారు.
ఈకార్యక్రమంలో యువజన సభ్యులు కొలుపుల సుధీర్, నల్లగొని సతీష్ గౌడ్, కందాల నవీన్, తాటికొండ తిరుపతి, కొండా అన్వేష్ , బత్తిని శేఖర్,గుండా నరహరి, గూడూరి గౌతమ్ , పొన్నాల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.








