contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రిపోర్టర్ టీవీ కథనానికి స్పందన.. వెదుళ్లువలసలో వెలిగిన వీధి దీపాలు

అనకాపల్లి జిల్లా, రోలుగుంట: రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామపంచాయతీ పరిధిలోని వెదుళ్లువలస ఎస్టీ గదబ పీవీటీజీ ఆదివాసీ గ్రామంలో గత మూడు నెలలుగా వీధి విద్యుత్ దీపాలు వెలగకపోవడంపై రిపోర్టర్ టీవీ ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు.

గ్రామంలో వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రి వేళల్లో చీకటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని రిపోర్టర్ టీవీ వెలుగులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఆదివాసీ కుటుంబాలు నివసించే ప్రాంతంలో రాత్రి సమయంలో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కథనంలో పేర్కొంది.

ఈ కథనం అధికారుల దృష్టికి వెళ్లడంతో సంబంధిత అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. వెదుళ్లువలస గ్రామంలో కొత్తగా వీధి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి, గ్రామానికి వెలుగులు తీసుకొచ్చారు.

అధికారుల స్పందనపై గ్రామస్తుల హర్షం

వీధి దీపాలు ఏర్పాటు కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సమస్యను గుర్తించి అధికారుల దృష్టికి తీసుకెళ్లిన రిపోర్టర్ టీవీకి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యపై వార్త ప్రచురించిన అనంతరం అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.

గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల సమస్యలను అధికారులు నిరంతరం పర్యవేక్షించి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని గ్రామస్తులు కోరారు.

ప్రజా సమస్యకు పరిష్కారం చూపిన వార్తా కథనం

ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని ఈ ఘటన మరోసారి నిరూపించింది. మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వీధి విద్యుత్ సమస్యపై రిపోర్టర్ టీవీ కథనం ప్రచురించడంతో అధికారులు స్పందించి దీపాలను ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

“ప్రజా సమస్యే మా వార్త.. పరిష్కారం దిశగా అడుగే మా లక్ష్యం” అనే నినాదంతో రిపోర్టర్ టీవీ ప్రజల సమస్యలను నిరంతరం వెలుగులోకి తీసుకురానుంది.

 

చీకట్లో గిరిజన గ్రామం – పట్టించుకోని కూటమి ప్రభుత్వం

Three Months Without Streetlights: PVTG Tribal Village Lives Under Darkness

तीन महीने से अंधेरे में PVTG गांव, स्ट्रीट लाइटों के लिए ग्रामीणों का इंतजार

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :