అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు మరియు విద్య రంగం సమస్యల పరిష్కారం కోసం APTF రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పెద్ద సంఖ్యలో ధర్నా నిర్వహించారు. గుత్తి జోన్ (గుంతకల్లు, గుత్తి, పెద్దవడుగూరు మండలాలు) నుండి APTF కార్యకర్తలు తరలివచ్చి తమ డిమాండ్లను వ్యక్తం చేశారు.
ప్రధాన డిమాండ్లు:
-
PRC కమిషన్‌ను వెంటనే నియమించాలి.
-
IR ను 30% గా ప్రకటించాలి.
-
పెండింగ్ DAలను విడుదల చేయాలి.
-
TETను రద్దు చేయాలి.
-
CPS విధానాన్ని రద్దు చేయాలి.
-
2003 DSP వారికి పాత పెన్షన్ అమలు చేయాలి.
-
APMS ఉపాధ్యాయుల కోసం సర్వీస్ రూల్స్ రూపొందించాలి.
-
KGBV ఉపాధ్యాయులకు MTS విధానాన్ని వర్తింపచేయాలి.
-
మునిసిపల్ ఉపాధ్యాయులకు PF సౌకర్యాన్ని వెంటనే కల్పించాలి.
-
మిగిలిన ఆర్థిక మరియు ఆర్థికేతర డిమాండ్లతో తాసిల్దార్ పుణ్యవతికి వినపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గుత్తి మండల అధ్యక్షులు మస్తాన్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, పెద్దవడుగూరు మండల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు, గుంతకల్లు మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అలాగే ఉపాధ్యాయులు శ్రీనివాసులు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
APTF నాయకులు అధికారులు సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఉపాధ్యాయుల జీవన ప్రమాణాలు మెరుగుపర్చే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.








