contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ముసారాం బాగ్ లో ఆషాఢ ఏకాదశి ఉత్సవాలు

ముసారం బాగ్ లో నెలకొన్న రుక్మిణి పాండురంగని ఆలయం లో ఆషాఢ శుద్ధ ఏకాదశి ను పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయనీ తెలంగాణ మరాఠా సమాజ్ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 24 వ తేదీ శుక్రవారం దశమి నాడు ఉదయం 6 గంటల నుంచి 12 వరకు అభిషేకాలు,అలంకారం, అర్చన, మహా నైవేద్యం మరియు సాయంత్రం 6 గంటల నుంచి 12 వరకు అర్చన,హారతి, భజన నిర్వహించబడుననీ అలాగే 25 వ తేదీ శనివారం శుద్ద ఏకాదశి ఉదయం 6 గంటల నుంచి అభిషేకాలు, అలంకారం,పుష్పార్చనాలు, తులసి అర్చనలు, హారతి నైవేద్యం ,సర్వ దర్శనం, రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు రథ యాత్ర అనంతరం భజన తో పాటు జాగరణ కార్యక్రమం ఉంటాయని అన్నారు. 26 తేదీ ఆదివారం ద్వాదశి నాడు ఉదయం 5 గంటల నుంచి 6 వరకు కాకడ హారతి, అలాగే 6 గంటల నుంచి 7 గంటల వరకు గోపాలకాల సేవ, 7 గంటల కు అర్చన తర్వాత హారతి నైవేద్యం అనంతరం ఉదయం 8 గంటల నుండి మహా అన్నదాన కార్యక్రమం, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు అర్చన, హారతి ఉంటుందనీ కావున భక్తులు సకాలంలో విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులవ్వలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు సుందర్ రావు వాగ్మరే, ఉపాధ్యక్షులు రాజేష్ వాగ్మరే, ప్రధాన కార్యదర్శి నితీష్ రావు, అశోక్ రావ్,లక్మన్ రావ్ కాంబ్దే తో పాటు తదితరులు పాల్గొన్నానున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :