అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణం, స్థానిక మున్సిపల్ కార్యాలయం దగ్గర రైతు సంఘం ఆధ్వర్యంలో గత 8 రోజులుగా రాగులపాడు కాలువ ఏర్పాటుకు నిధులు ఇచ్చి సాగునీరు, తాగునీరు అందివ్వాలని సామూహిక దీక్షలు చేస్తున్న రైతులకు గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త వాసగిరి మణికంఠ సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రైతు కష్టాన్ని తెలుసుకుని రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 30 వేల కౌలు రైతు కుటుంబాలకు నేనున్నాను అంటూ కౌలు రైతు భరోసా యాత్ర ద్వారా ఒక్కొక్క రైతు కుటుంబానికి 1లక్ష రూపాయలు చొప్పున తన సొంత నిధులను 30 కోట్ల రూపాయలను ఇచ్చి ఆదుకున్న ఏకైక నాయకుడు కొణిదల పవన్ కళ్యాణ్ అని ఉద్ఘాటించారు. ఈరోజు ఆయన స్ఫూర్తితోనే అన్నం పెట్టే రైతన్నకు సంఘీభావం తెలపడానికి వచ్చామన్నారు. ముఖ్యంగా రైతు కష్టాన్ని తీర్చేది కూటమి ప్రభుత్వమే అందుకు ఉదాహరణే అతి తక్కువ వ్యవధిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో హంద్రీనీవా కాలువను వెడల్పు చేసి గతంలో కంటే ఎక్కువగా కృష్ణా జలాలు జిల్లాకు తీసుకు వచ్చాడని పేర్కొన్నారు. అలాగే చిత్తశుద్ధితో రాగులపాడు కాలవ నిర్మాణం కొరకు గుంతకల్ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం అసెంబ్లీలో తన గళాన్ని వినిపించారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గాజుల రఘు, కథల వీధి అంజి, సుంకర నాగరాజు మైనార్టీ నాయకుడు దాదు, అమర్, ధోని ముక్కల విజయ్, ముద్దలాపురం ప్రసాద్, ఫణి రాయల్, మంజు, గిరిధర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.









