అనంతపురం జిల్లా గుత్తి పట్టణము గాంధీ సర్కిల్ వద్ద ఆదివారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు ఘనంగా జోహార్లు అర్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు నగదాని ఈరన్న మాట్లాడుతూ 1994వ సంవత్సరంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దండోరా ను ఏర్పాటు చేయడమైనది, అందులో భాగంగానే షెడ్యూల్డ్ కులాలను ఏబిసిడి వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ ఏర్పాటు చేసి గత 30 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించడమైనది. ఈ పోరాటంలో అనంతపురం జిల్లాకు చెందినటువంటి ఎర్రగుంటపల్లి తెల్లబండ్ల రవి మాదిగ ఎస్సీ వర్గీకరణ పోరాటంలో మొట్టమొదటిసారిగా అసువులు బాసినరు. అలాగే మరికొంతమంది ప్రాణ త్యాగం చేసి వర్గీకరణకు విజయ సారధులు అయినారు. పోరాట ప్రథమం నుండి ఎంఆర్పిఎస్ కొరకు పోరాడి మరణం పొందిన గుత్తి పట్టణానికి చెందిన వీరన్న ప్రతి ఒక్కరికి ఆదర్శమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి వీరన్న, మండల నాయకులు సత్య, వీరాంజనేయులు, అయ్యప్ప, సిపిఐ మండల కార్యదర్శి రామదాసు, సిసి హెచ్ సి రంగడు, మద్దిలేటి, సూరి, రామాంజనేయులు, ప్రభాకరు, ఎంఆర్పిఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నరు.








