- బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్
కరీంనగర్ జిల్లా: బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ ఆహ్వానం మేరకు గన్నేరువరం మండలంలోని మైలారం మైసమ్మ గుట్ట ప్రాంతాన్ని మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైలారం నుండి సప్తగిరి కాలనీ వరకు మానేరు పైన బ్రిడ్జి నిర్మించడం వల్ల అన్ని గ్రామాలకు ప్రయోజనం చేకూరుతుంది అని తెలిపారు. అలాగే ఇట్టి బ్రిడ్జి నిర్మాణం మైలారం మైసమ్మ గుట్ట నుండి సప్తగిరి కాలనీ స్మశాన వాటిక వరకు జరగాలని సంపూర్ణ మద్ధతు ప్రకటిస్తూ వారి వారి గ్రామ పంచాయతీల తీర్మాణాలు బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కి అందజేశారు. అలాగే బ్రిడ్జి నిర్మాణం వేరే చోట చేపట్టినట్లయితే ప్రజా పోరాటానికి సిద్ధం అని తెలియజేసారు. మైలారం మైసమ్మ గుట్ట నుండి సప్తగిరి కాలనీ స్మశాన వాటిక వరకు బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని బ్రిడ్జి జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ ఇటీవల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదలను సర్పంచ్లకు అందజేశారు. ఈ సందర్భంగా సంపతి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ సోమవారం మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్ లు మైలారం నుండి సప్తగిరి కాలనీ వరకు మానేరు పైన బ్రిడ్జి నిర్మాణానికి మద్దతుగా గ్రామపంచాయతీ తీర్మానం చేయటం అనేది బ్రిడ్జ్ జేఏసీ ఉద్యమానికి, మెజారిటీ ప్రజాభిప్రాయానికి ఎంతో బలం చేకూరిందని అన్నారు.
మైలారం,కరీంనగర్ (సప్తగిరి కాలనీ) బ్రిడ్జి నిర్మాణం జరగటం వలన ప్రయోజనాలు.. మానేరు డ్యామ్ నిర్మాణానికి భూములుకోల్పోయిన వారు ఎక్కువ మంది ఇక్కడివారే కాబట్టి వాళ్లకు న్యాయం చేసినట్లువుతుంది. అలాగే డ్యామ్ నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన మునగకుండా ఉన్న వందలాది ఎకరాలు ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవచ్చు. గన్నేరువరం మండల ప్రజలకు కరీంనగర్ కేవలం 7 కిలోమీటర్ దూరంతో చాలా దగ్గర అవుతుంది. మైలారం నుండి బెజ్జంకి రూట్లో ఇది వరకే కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మంజూరు చేసిన డబుల్ రోడ్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఈ రూట్ లో హైదరాబాద్ వెళ్లే కరీంనగర్ ప్రజలకు సుమారు 30 కిలోమీటర్లు దూరం తగ్గుతుంది. స్వయంభు మల్లికార్జున స్వామి, స్వయంభు మానసా దేవి, స్వయంభు లక్ష్మి గణపతి ఆలయాలు దర్శించుకునే భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఇక్కడ ఇది వరకే ప్రభుత్వం ఆదీనంలో ఉన్న భూములు ఉన్నవి కాబట్టి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి భూమి సేకరించవలసిన అవసరం ఎక్కువగా ఉండదు అన్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆర్ అండ్ బి అధికారులు మెజారిటీ ప్రజల, ప్రజా ప్రతినిధుల అభిప్రాయానికి విలువ ఇస్తూ అందరికీ ఉపయోగపడే విధంగా మైలారం నుండి సప్తగిరి కాలనీ వరకు మానేరు పైన బ్రిడ్జ్ నిర్మించాలని కోరారు. ..లేని పక్షంలో పోరాటం నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు మాదరి శ్రీనివాస్, సొల్లు అజయ్ వర్మ, జంగిటి ప్రకాష్,సామ రాజిరెడ్డి,కన్నె చంద్రయ్య, నందికొండ అంజిరెడ్డి, నాయకులు గాలిపెళ్లి శంకర్,ఆకుల సంతోష్, రేపాక బాబు పాల్గొన్నారు.









