కరీంనగర్ జిల్లా: పదో తరగతి పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి పరీక్షలు సజావుగా జరిగేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గన్నేరువరం మండలం లోని రెండు ప్రభుత్వ పాఠశాలలు, రెండు ప్రైవేటు పాఠశాలల నుంచి 120 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అయ్యారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరపున కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకున్నట్లు ఎస్ఐ నరేందర్ రెడ్డి తెలిపారు. పరీక్ష కేంద్రం వద్ద ఎస్సై నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సెక్షన్ 163 బిఎన్ఎస్ఎస్ ( పాత సెక్షన్ 144 సిఆర్పీసీ) అమలులో ఉంటుందని వెల్లడించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఇలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, లేదా మైకులు డీజీలతో ఊరేగింపులు నిర్వహించారని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణము నెలకొల్పేందుకు కేంద్రం సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు జారీ చేశామన్నారు. పరీక్షలు సజీవుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రం వద్ద పోలీస్ అధికారులు, సిబ్బందితో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేస్తున్నమని తెలిపారు.








