అనంతపురం జిల్లా గుత్తి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు పరిధిలో కొత్తపల్లి అంగన్వాడి వర్కర్ సృజన కు, మరియు పామిడి, ములకలపెంట, కొత్తపేట, నాగసముద్రం, ఎద్దులపల్లి, వైటీ చెరువు గ్రామాలకు చెందిన కవిత, సుస్మిత, ఊర్మిళ, సుశీల, అరుణ, రహీంబి అనే ఆరుగురు అంగన్వాడీ సహాయకురాలుగా ఎంపికైన సందర్భంగా మంగళవారం సిడిపిఓ ఎల్లమ్మ చేతులు మీదుగా ఐసిడిఎస్ కార్యాలయంలో నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమయపాలన పాటిస్తూ, గర్భిణీ, బాలింతల యోగక్షేమాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కిషోర్ బాలికలు, స్కూల్ కి విచ్చేసి చిన్నారులపై ప్రత్యేక దృష్టి ఉంచి వారి సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు.







