కొమురం భీం అసిఫాబాద్ జిల్లా, కాగజ్‌నగర్ మండల కేంద్రంలో సమాచార హక్కు రక్షణ చట్టం–2005 ఐదవ రాష్ట్ర మహాసభల పోస్టర్లను జిల్లా అధ్యక్షుడు వంగరి ప్రవీణ్ విడుదల చేశారు. ఈ కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ, మార్చి 24, 2026న సూర్యాపేట జిల్లాలో నిర్వహించనున్న సమాచార హక్కు రక్షణ చట్టం–2005 సొసైటీ ఐదవ రాష్ట్ర మహాసభలకు ఆర్టీఐ కార్యకర్తలు, సొసైటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తుదారులు, ఆర్టీఐ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను ఈ మహాసభలో విస్తృతంగా చర్చించనున్నట్లు తెలిపారు. ఆ సమస్యలను ప్రభుత్వ మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం మరింత బలోపేతంగా అమలయ్యేలా చర్యలు చేపట్టేందుకు ఈ మహాసభ దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిప్పిరి చరణ్ దాస్, భీమేష్, సమీర్, హరీష్, ప్రశాంత్, జిల్ల గంగన్న తదితరులు పాల్గొన్నారు.








