contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఇసుక అక్రమ రవాణా పై ఉక్కు పాదం

మెదక్ తూప్రాన్ డివిజన్ : ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం మెదక్ తూప్రాన్ డివిజన్ పరిధిలో మెరుపు దాడులు నిర్వహించారు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ శాఖల సంయుక్త బృందం ఈ ఆపరేషన్ చేపట్టింది.

మంగళవారం మెదక్ ప్రాంతంలోని పసుపులేరు వాగు సమీపంలో గంగమ్మ గుడి, ఎల్లమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్న మార్గాన్ని అధికారులు గుర్తించారు. వెంటనే ఆ మార్గాన్ని జేసీబీ సహాయంతో త్రవ్వి మూసివేశారు. అలాగే అక్కడ అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 60 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకుని, టిప్పర్ల ద్వారా మెదక్‌లోని సాండ్ బజార్‌కు తరలించారు.

ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, ఇసుక అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్ శాఖలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :