contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

దళితులకు అన్యాయం జరిగితే ఊరుకోం: రావాడ సీతారాం

జియ్యమ్మవలస : పార్వతీపురం మన్యం జిల్లాలోని జియ్యమ్మవలస మండలం చింతలబెలగం గ్రామంలో దళిత కుటుంబాలకు చెందిన డి-పట్టా భూముల ఆక్రమణ, అలాగే బర్రిల్లు గ్రౌండ్ (శ్మశానవాటిక) వివాదంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబాలతో మాట్లాడి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన సీతారాం, ఈ సమస్య దాదాపు మూడు నెలల క్రితమే కమిషన్ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన తొమ్మిది మంది ఎస్సీ రైతుల డి-పట్టా భూములను ఇతర సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు ఆక్రమించుకున్నారని ఆయన ఆరోపించారు.

అలాగే, ఇటీవల బెలగాం సాయిమ్మ అనే ఎస్సీ మహిళ మృతి చెందగా, ఆమె మృతదేహాన్ని దళితుల శ్మశానవాటికలో పాతిపెట్టిన అనంతరం, ఆ స్థలం తమదని చెప్పుకుంటూ ఇతర వర్గాలకు చెందిన వారు అభ్యంతరం వ్యక్తం చేసి, రాత్రికి రాత్రే మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించి మరోచోట పూడ్చిపెట్టేలా చేయడం అత్యంత అమానవీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన సమాజం తలదించుకునేలా చేసిందని పేర్కొన్నారు.

రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కె. జవహర్ రావు ఆదేశాల మేరకు తాను గ్రామానికి వచ్చి, 12 ఎకరాల భూమి వివాదం మరియు శ్మశానవాటిక ఘటనపై రెవెన్యూ అధికారులతో కలిసి విచారణ జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలపై సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని, దళిత రైతులు మరియు బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.

ఈ పర్యటనలో స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులు, ఇతర ప్రభుత్వ విభాగాల సిబ్బంది, కమిషన్ ప్రతినిధులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :