చేగుంట తూప్రాన్ డివిజన్ : చేగుంట మండలం శివారులోని పొలంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ కొండి రాజ్యలక్ష్మి స్వామి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, లబ్ధిదారులు తమకు కేటాయించిన ఇండ్ల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణంలో ఏవైనా సమస్యలు ఎదురైతే తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.
“మన పొలంపల్లి గ్రామం మండలంలోనే మొదటగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ఆదర్శ గ్రామంగా నిలవాలి. మీరు వేగంగా పనులు పూర్తి చేస్తే, రెండో విడతలో మరింత మంది నిరుపేదలకు ఇండ్లు అందించే అవకాశం ఉంటుంది” అని రాజ్యలక్ష్మి స్వామి తెలిపారు.
అనంతరం లబ్ధిదారులందరూ పరస్పరం సహకరించుకొని త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆమె కోరారు.








