కరీంనగర్ జిల్లా : కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల పరిషత్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ టి. పవన్ కుమార్ గురువారం సందర్శించారు.
ఈ సందర్భంగా కార్యాలయంలో నిర్వహణలో ఉన్న రికార్డులను ఆయన పరిశీలించారు. పలు విభాగాల పనితీరును సమీక్షించి, నిర్వహణలో మెరుగుదల కోసం అవసరమైన సూచనలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉండేలా అధికారులు కృషి చేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ వరప్రసాద్, గన్నేరువరం ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎంపీఓ సురేందర్‌తో పాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.








