contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

పాడి రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం .. ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

పార్వతీపురం, మన్యం జిల్లా / గుమ్మలక్ష్మిపురం: పాడి రైతులు ఆర్థికంగా స్థిరపడటమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, పాడి రంగ అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు.

గుమ్మలక్ష్మిపురం మండలం లక్కగూడ గ్రామంలో గురువారం పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గోబాల సంబరం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఆవు దూడల ఆరోగ్యం, పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించి, ముఖ్యంగా లింగ నిర్ధారణ పరీక్షలు ప్రతి వెటర్నరీ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.

ఎమెల్యే ముఖ్యంగా ఈ విషయాలను వివరించారు:

  • ఆడ దూడల పెంపకం: ‘ట్రిపుల్ ఎస్’ ఇంజెక్షన్ల ద్వారా ఆడ దూడలు పుట్టే అవకాశాన్ని పెంపొందిస్తున్నామని అన్నారు.
  • గోశాలల ఏర్పాటు: గతంలో గోశాలలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పటిష్టమైన గోశాలలను నిర్మించామని తెలిపారు.
  • పశు బీమా పథకం: పశువుల సంరక్షణలో భాగంగా అందిస్తున్న ‘పశు బీమా’ పథకాన్ని ప్రతి పాడి రైతు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి మన్మధరావు, ఏడి డాక్టర్ శ్రీ సంధ్య, డాక్టర్ లక్ష్మణరావు, పశుసంవర్థక శాఖ సిబ్బంది, స్థానిక పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :