contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

గర్భిణీ మహిళలకు మాతృదేవోభవ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ

వెల్దుర్తి/తూప్రాన్ డివిజన్ : వెల్దుర్తి మండలంలోని బాలాజీ గార్డెన్స్‌లో గురువారం రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు మాతృదేవోభవ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండలానికి చెందిన 170 మంది గర్భిణీ స్త్రీలకు రాజన్న ఫౌండేషన్ చైర్మన్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆవుల రాజిరెడ్డి న్యూట్రిషన్ కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, పోషకాహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని తెలిపారు. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని అన్నారు.

అనంతరం మన్నేవారి జలాల్‌పూర్ గ్రామంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :