contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

వృద్ధాశ్రమంలో సేవా కార్యక్రమం

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా వీర్లపల్లి గ్రామంలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో మంగళవారం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17, 2026 వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి పాల్గొని వృద్ధులను సన్మానించారు. అనంతరం వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుని, కొంతసేపు వారితో ఆత్మీయంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు పి.టి. స్వామి, ఆశ్రమానికి అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న మాధవరెడ్డిని సంధ్యారాణి అభినందించారు. వృద్ధుల కోసం వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. సమాజంలో వృద్ధులకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు ఆప్యాయత, సేవ, భరోసా కల్పించడం ఎంతో గొప్ప విషయమని సంధ్యారాణి పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా సమాజంలో మానవతా విలువలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

‘సేవే సంకల్పం.. సమాజ సేవే లక్ష్యం’ అనే భావనతో సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో 8 ఇంక్లైన్ కాలనీ మండల అధ్యక్షులు ఆకుల శశికుమార్, మూకిరి రాజు, ఆకుల కుమార్ గౌడ్, లింగం నాయక్, అనిల్ కుమార్, జంజర్ల శ్రీనివాస్, కండే సాగర్, జక్కన బాలు, బూడిద హర్ష, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :