కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : సిర్పూర్ (టి) మండలం పరిగాం గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనమండలి సభ్యులు దండే విఠల్ సోమవారం ఘనంగా భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని పునరుద్ఘాటించారు. గ్రామంలో నిర్మించబోయే ఈ కమ్యూనిటీ హాల్ ద్వారా దళిత సామాజిక వర్గానికి చెందిన వారు శుభకార్యాలు, సామాజిక సమావేశాలు నిర్వహించుకోవడానికి ఎంతో వెసులుబాటు కలుగుతుందని తెలిపారు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించాలని, త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్సీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించిన దండే విఠల్ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మరియు ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








