contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మినీ మహానాడు విజయవంతం చేద్దాం : ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి గుంతకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, టీడీపీ గుంతకల్లు మండల ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ, నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్న మినీ మహానాడును విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ నెల 18, 19, 20 తేదీలలో ఒక తేదీని ఖరారు చేసి మినీ మహానాడును అట్టహాసంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, పట్టణ వార్డుల నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ బలోపేతానికి మినీ మహానాడు వేదిక కావాలని ఆయన పేర్కొన్నారు.

ఈ సమావేశంలో గుంతకల్లు నియోజకవర్గ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :